బీచ్ రోడ్‌లోని కురుపాం సర్కిల్ వద్ద తమ సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉద్యోగులు రహదారి మీదకు రాగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దానికి నాయకత్వం వహిస్తున్న నేతలను ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు.

విశాఖపట్నం : Visakhapatnam పర్యటనలో ఉన్న సీఎం ys jaganకు పొరుగుసేవల సిబ్బంది నుంచి నిరసన సెగ తగిలింది. బీచ్ రోడ్​లో కురుపాం సర్కిల్ వద్ద.. పొరుగుసేవల సిబ్బంది ఒక్కసారిగా మెరుపు ధర్నాకు యత్నించారు. విశాఖ పర్యటనలో సీఎం జగన్ వచ్చే మార్గంలో వీరు హఠాత్తుగా నిరసనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

బీచ్ రోడ్‌లోని కురుపాం సర్కిల్ వద్ద తమ సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉద్యోగులు రహదారి మీదకు రాగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దానికి నాయకత్వం వహిస్తున్న నేతలను ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయక పని చేస్తే.. విధుల్ని నుంచి తొలగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే ఆరెస్ట్ చేయడాన్ని నేతలు ఖండించారు.

YS Jagan Vizag Tour: అభివృద్ధి కార్యక్రమాలు, వివాహ వేడుకలతో జగన్ బిజీ (వీడియో)

ఇదిలా ఉండగా, శుక్రవారం సాయంత్రం visakhapatnamలో పర్యటించిన ఏపీ సీఎం వైఎస్ జగన్‌ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఏడీ జంక్షన్‌లో రూ.150 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం విశాఖ బీచ్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన జీవీఎంసీ స్మార్ట్‌ సిటీ పార్కును ప్రారంభించారు.

 తర్వాత ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన విజయనగరం డీసీసీబీ ఛైర్మన్‌ నెక్కెల నాయుడుబాబు కుమార్తె వివాహ విందుకు హాజరై.. నూతన వధూవరులను సీఎం ఆశీర్వదించారు. ఆతర్వాత వైజాగ్‌ కన్వెన్షన్‌లో నిర్వహించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి మనవరాలు నిహారిక, రవితేజ రిసెప్షన్‌కు హాజరై.. కొత్త దంపతులకు ఆశీస్సులు అందించారు. ముఖ్యమంత్రి జగన్ వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు అమర్‌నాథ్‌, కరణం ధర్మశ్రీ తదితరులు ఉన్నారు.