రైతు భరోసా రెండో విడత నిధులు నేడు విడుదల కానున్నాయి. ఆళ్లగడ్డలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బులు ఖాతాల్లో జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా మూడు రోజుల ముందు నుండే ఆళ్లగడ్డలో బారికేడ్లు ఏర్పాట్లు చేశారు.
నంద్యాల : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఆళ్లగడ్డలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేయనున్నారు.
సీఎం జగన్ ఆళ్లగడ్డ పర్యటన అప్ డేట్స్..
ఉదయం 10.10ని.లు
- సీఎం జగన్ ఆళ్లగడ్డకు చేరుకుని వైఎస్ఆర్ రైతు భరోసా నగదు జమా కార్యక్రమం ప్రారంభం
ఉదయం 9.03ని.లు
- వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత నగదు జమ కార్యక్రమం కోసం తాడేపల్లి నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు సీఎం జగన్ బయలుదేరారు.
- వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం రెండో విడత ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో కార్యక్రమాలు బహిరంగ సభలో ప్రసంగించి.. ఆ తరువాత నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తారు.
- వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు.
- వై యస్ ఆర్ రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయం అందజేస్తున్నారు.
- మే నెలలో ఖరీఫ్ కు ముందే తొలివిడత సాయాన్ని అందజేసింది.
- మూడో విడత సంక్రాంతి సమయంలో విడుదల చేయనుంది.
- తాజాగా అందించే రూ.2,096.04 కోట్లతో కలిపితే.. ఇప్పటివరకు ఒక్క వైఎస్సార్ రైతు భరోసా ద్వారానే రూ.25,971.33 కోట్ల మేర ఏపీ రైతులకు లబ్ధి చేకూర్చడం గమనార్హం.
