తిరుపతి జిల్లా పేరూరులో శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

తిరుపతి జిల్లా పేరూరులో శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పర్యటన కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రార్డె, జిల్లా కలెక్టర్‌ కె వెంకట రమణారెడ్డి తదితరులు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం జగన్ రోడ్డుమార్గంలో శ్రీ వకుళమాత ఆలయానికి చేరుకన్నారు. 

ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ వెంట మంత్రులు రోజా, పెద్దిరెడ్డిలతో ఇతరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో సీఎం జగన్ మొక్కను నాటారు. 

అనతంరం తిరుపతి పర్యటన లో భాగంగా పలు పరిశ్రమలు ప్రారంభించనున్నారు. శ్రీకాళహస్తి లోని ఇనగలూరు చేరుకుని హిల్‌టాప్‌ సెజ్‌ ఫుట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌ (అపాచీ) పాదరక్షల తయారీ యూనిట్‌ నిర్మాణ పనుల భూమిపూజలో పాల్గొంటారు. అనంతరం ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ–1 పరిధిలోని టీసీఎల్‌ పరిశ్రమ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సీఎం జగన్ అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.