ఆంధ్రప్రదేశ్‌లో మాండూస్ తుఫాన్ కారణంగా సంభవించిన భారీ వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్లకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో మాండూస్ తుఫాన్ కారణంగా సంభవించిన భారీ వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్లకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులను ఆదుకోవడంలో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎన్యుమరేషన్‌ విషయంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. వారంరోజుల్లో ఎన్యుమరేషన్‌ పూర్తిచేయాలని ఆదేశించారు. రైతులు నిరాశకు గురికాకూడదని.. రంగు మారిన, తడిసిన ధాన్యం కొనుగోలు చేయలేదన్న మాట ఎక్కడ రాకూడదని చెప్పారు. 

బయట మార్కెట్‌లో విక్రయించినా రైతులకు మంచి ధర రావాలని అన్నారు. వారికి రావాల్సిన రేటు వచ్చేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంటుందన్నారు. పంట నష్టపోయిన రైతులకు మళ్లీ పంటలు వేసుకునేందుకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందజేయాలన్నారు. భారీ వర్షాల కారణంగా ఇళ్లు ముంపునకు గురైన కుటుంబాలకు రూ. 2 వేలతో పాటు రేషన్‌ కూడా అందించాలన్నారు.

Scroll to load tweet…

పంటలు కోల్పోయిన వారికి, పశువులకు నష్టం వాటిల్లిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పారు. పరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించాలని.. వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం జగన్ సూచించారు.