విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దర్శించుకున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మూల నక్షత్రం రోజైన నేడు కనదుర్గమ్మకు సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇందుకోసం సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంద్రకీలాద్రికి చేరుకన్నారు. అక్కడ సీఎం జగన్‌కు వేదపండితులు, దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
అనంతరం సీఎం జగన్ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలతో పాటు పసుపు, కుంకుమలు కూడా అందజేశారు. అమ్మవారి దర్శనం చేసుకని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు సీఎం జగన్‌కు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం సీఎం జగన్‌కు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.
సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నందున.. 45 నిమిషాల పాటు భక్తుల దర్శనాలను నిలిపివేశారు.
ఇక, నేడు కనకదుర్గ అమ్మవారు నేడు సరస్వతి దేవి అలకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అర్దరాత్రి నుంచే అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతుంది. భక్తుల రద్దీతో క్యూ లైన్లు నిండిపోయాయి. వీఎంసీ , కెనాల్ రోడ్లు భక్తులతో నిండిపోయాయి. ఈరోజు అమ్మవారిని దర్శించుకునేందుకు 2.5లక్షల మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో భ్రమరాంబ, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, సీపీ కాంతి రాణా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
