ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలోని ఏపీజెన్‌కో ప్రాజెక్టు మూడో యూనిట్‌‌ను సీఎం జగన్‌ను జాతికి అంకితం చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలోని ఏపీజెన్‌కో ప్రాజెక్టు మూడో యూనిట్‌‌ను సీఎం జగన్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. తాజాగా సీఎం జగన్ నెల్లూరు పర్యటన‌కు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారు అయింది. 

ఈ నెల 27న ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నెల్లూరు బయలుదేరతారు. ఉదయం 10.55 గంటకు కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు. అనంతరం 800 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ఏపీజెన్‌కో ప్రాజెక్ట్ మూడో యూనిట్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1.10 గంటల తర్వాత సీఎం జగన్ తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్టుకు పయనమవుతారు. సాయంత్రం 3.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.