ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్... ఆక్వా రైతులకు వరాలు కురిపించారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.  ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా జగన్ పై ప్రశంసలు కురిపించారు. జగన్ ఆక్వా రైతులకు అందిస్తున్న అవకాశాన్ని కూడా ఆయన వివరించారు.

ఆక్వా రైతదులకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఇది ఆక్వా రైతులకు జగన్ అందిస్తున్న వరమని విజయసాయి రెడ్డి అన్నారు. దీనివల్ల ఆక్వా రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. చాలీచాలనీ రాబడితో సతమతమౌతున్న 53వేల మంది రైతులకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రభుత్వం ఆక్వా సాగుకు వాడే కరెంట్ కు యూనిట్ కి రూ.3.86 చొప్పున వసూలు చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.