Asianet News TeluguAsianet News Telugu

త్వరలోనే మంత్రివర్గ విస్తరణ.. కేబినెట్‌లోకి మైనారిటీలు: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ మైనారిటీ వర్గాల అభ్యున్నతికి ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గుంటూరులో జరిగిన ‘ నారా హమారా.. టీడీపీ హమారా’ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగిస్తూ.. స్వాతంత్ర్య సమరంలోనూ.. ఇతర పోరాటాల్లోనూ ముస్లింలు కీలక పాత్ర పోషించారన్నారు. 

cm chandrababu speech in Nara Hamara - TDP Hamara
Author
Guntur, First Published Aug 28, 2018, 6:45 PM IST

తెలుగుదేశం పార్టీ మైనారిటీ వర్గాల అభ్యున్నతికి ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గుంటూరులో జరిగిన ‘ నారా హమారా.. టీడీపీ హమారా’ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగిస్తూ.. స్వాతంత్ర్య సమరంలోనూ.. ఇతర పోరాటాల్లోనూ ముస్లింలు కీలక పాత్ర పోషించారన్నారు.

హైదరాబాద్‌‌లో ఆరు నెలల పాటు కర్ఫ్యూ ఉండేదని... ఆ పరిస్థితిని మార్చి జంట నగరాల్లో, రాష్ట్రంలో మతసామరస్యాన్ని నెలకొల్పిన ఘనత టీడీపీదేనన్నారు. నాడు రాష్ట్రపతి పదవికి ఏపీజే అబ్దుల్ కలాం గారిని ప్రతిపాదించి, ఆయన్ను ఒప్పించి రాష్ట్రపతిని చేయడంలో టీడీపీ కీలక భూమిక పోషించిందన్నారు.

గోద్రా అల్లర్ల సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీని రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేసింది ఒక్క తెలుగుదేశం పార్టీయేనన్నారు. కశ్మీర్‌లో అత్యాచారానికి గురైన అసిఫా విషయంలోనూ, ట్రిపుల్ తలాక్ చట్టం వెనుక టీడీపీ పోరాటం చేసిందని చంద్రబాబు గుర్తు చేశారు.

దుల్హాన్, హజ్ హౌస్, రంజాన్ తోఫా, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాల ద్వారా మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు సీఎం తెలిపారు. మైనారిటీల జోలికి వస్తే ఖబద్దార్ అని హెచ్చరించారు. హజ్‌కు వెళ్లే వారి కోసం హజ్‌ హౌస్‌లు కట్టిస్తున్నామని.. అతి త్వరలో అమరావతి నుంచి మక్కాకి నేరుగా విమాన సౌకర్యాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

రాయలసీమ నాలుగు జిల్లాలతో  పాటు కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఉర్దూని రెండో భాషగా అమలు చేస్తామని సీఎం తెలిపారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేసి.. కేబినెట్‌లోకి మైనారిటీ వ్యక్తిని తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. అక్టోబర్ 2 నుంచి నిరుద్యోగ భృతి అమల్లోకి వస్తుందని సీఎం వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios