ఎంపీలంతా.. మురళీమోహన్ ని చూసి నేర్చుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. ఎంపీ నిధులతో మంచి పని చేసిన మురళీమోహన్ పై చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ మ్యాటరేంటంటే... ఎంపీ మురళీమోహన్ ఎంపీ నిధులతో రూ.1.175 లక్షలతో మొబైల్ క్యాన్సర్ వాహనాన్ని తయారు చేయిచారు. కాగా  దానిని  సీఎం చంద్రబాబు ఈ రోజు ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎంపీని అభినందస్తూ మురళీమోహన్ ఓ మంచి ఆలోచన చేశారని, ఆయన బాటలో మిగిలిన ఎంపీలు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చంద్రన్న సంచార చికిత్స పేరుతో గ్రామలలో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఓ వాహనం అందుబాటులోకి తీసుకువస్తే రాష్ట్రంలో క్యాన్సర్‌ను పూర్తిగా జయించవచ్చన్నారు. ఈ అంబులెన్స్ ద్వారా గ్రామీణ ప్రజలకు క్యాన్సర్ ముందస్తు పరీక్షలు పూర్తిగా అందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
 
అనంతరం ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ గ్రామాలలో క్యాన్సర్ చికిత్సలను అందుబాటులో తీసుకువచ్చేందుకు ఈ వాహనం రూపొందించామన్నారు. మండల హెడ్‌క్వార్టర్స్‌లో ఈ వాహనాన్ని ఉంచి గ్రామలలో ఉన్న ప్రజలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి వాహనాలను ఏర్పాటు చేసి క్యాన్సర్ నివారణకు కృషి చేయలనేదే తన ఉద్దేశమని ఎంపీ మురళీమోహన్ స్పష్టం చేశారు.