Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలంటే  హెచ్చరించారు. ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ప్రస్తుత రాజకీయ పరిణామాలు వంటి అంశాలపై చర్చించారు. 

cm chandrababu naidu warned to sitting mlas
Author
Amaravathi, First Published Sep 5, 2018, 7:58 PM IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలంటే  హెచ్చరించారు. ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ప్రస్తుత రాజకీయ పరిణామాలు వంటి అంశాలపై చర్చించారు. 

మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు, అభివృద్ధి పనులపై పార్టీ రాష్ట్ర కార్యాలయం రూపొందించిన నివేదికను ఎమ్మెల్యేలకు నేరుగా అందజేసింది. ఎమ్మెల్యేల పనితీరు, జాతకాల చిట్టా మెుత్తం ఆ కవర్లలో పొందుపరిచి ఉంది. పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాల అమలు, ఎమ్మెల్యేల పనితీరును నివేదికలో పొందుపర్చారు. 

నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, అంతర్గత విబేధాలు, సర్ధుబాటు చేసుకోవాల్సిన అంశాలపై ఈ రిపోర్టులో సమగ్రంగా పొందుపరిచినట్లు తెలుస్తోంది. మండలాల వారీగా పార్టీ పరిస్థితిపై నివేదికలిచ్చారు. నియోజకవర్గాల్లో పనితీరుపై తమ జాతకాల కవర్లు చూసుకున్న ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోయారు. నివేదికలో కళ్లకు కట్టినట్టు వివరించారని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఈ నివేదిక ఆధారంగానే పనితీరు మార్చుకోవాలని కొందరు ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు  హితబోధ చేశారు.

 ప్రతీ ఎమ్మెల్యే జాతకం తన దగ్గర ఉందన్నారు. ప్రజలకు సేవ చేసే గెలుపు గుర్రాలనే ఎంపిక చేస్తానని అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. పని తీరు మెరుగుపర్చుకోవాలని కొందరు ఎమ్మెల్యేలకు ఎప్పటి నుంచో చెప్తున్నానని అయినా ధోరణిలో ఎలాంటి మార్పు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడతానని తెలిపారు. పార్టీ ఉంటేనే మనం ఉంటామని గుర్తుంచుకోవాలని పార్టీ కోసం అహర్నిశలు శ్రమించాలని సూచించారు. ఎమ్మెల్యేలు అహాన్ని వీడకుంటే ఇబ్బందులు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. 

ఇప్పటికే పార్టీలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్మేల పనితీరు బాగోలేదని వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వరని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వణుకు మెుదలైంది. 

Follow Us:
Download App:
  • android
  • ios