Asianet News TeluguAsianet News Telugu

ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..ఏపీకి అన్యాయం చేస్తే ఊరుకోం: కేంద్రంపై చంద్రబాబు

 ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఐటీ దాడులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ దాడులపై కేంద్రం కుట్ర అంటూ ప్రశ్నించారు. రాజకీయంగా బెదిరించేందుకే ఐటీ దాడులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. 
 

cm chandrababu naidu fires on it rides
Author
Srikakulam, First Published Oct 12, 2018, 9:07 PM IST

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఐటీ దాడులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ దాడులపై కేంద్రం కుట్ర అంటూ ప్రశ్నించారు. రాజకీయంగా బెదిరించేందుకే ఐటీ దాడులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. 

టీడీపీ నేతలపై ఐటీ దాడులను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి సరికాదని చంద్రబాబు సూచించారు. తమని మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని అది ఎవరివల్లా సాధ్యం కాదన్నారు. దాడుల పేరుతో ఏపీకి అన్యాయం చేస్తే 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌నే ప్రజలు తిరస్కరించారని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. 
 
ఇటీవలే టీడీపీ సీనియర్ నేత ఆక్వా రంగ వ్యాపారి బీద మస్తాన్‌రావు వ్యాపార సంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. వ్యాపార రంగంతోపాటు రాజకీయ రంగంలో కూడా ప్రత్యేక గుర్తింపు ఉన్న బీఎంఆర్‌ సంస్థలపై ఐటీ సోదాలు జరగడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
 
మరోవైపు ఈనెల 10న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి సంబంధించిన సంస్థల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. చెన్నై నుంచి వచ్చిన సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి హైదరాబాద్‌తోపాటు ఏపీలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లో జరిపిన సోదాల్లో ఒకే చిరునామాపై వందకుపైగా కార్యాలయాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు అందుకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
 
ఇకపోతే శుక్రవారం ఎంపీ సీఎం రమేష్‌ నివాసాలపై ఐటీ దాడులు జరిగాయి. హైదరాబాద్‌లోని రమేష్‌ నివాసం, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అలాగే కడప జిల్లా పోట్లదుర్తిలోని నివాసంలోనూ సోదాలు చేశారు. అంతే కాకుండా ఆయన బంధువుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు చేశారు. 

ఏకకాలంలో 100 మంది ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. సోదాల్లో 15 మంది కమిషనర్‌ స్థాయి అధికారులు పాల్గొన్నారు. 25 నుంచి 30 చోట్ల ఐటీ సోదాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రమేష్ ఢిల్లీలో ఉన్నారు. 

కేంద్ర పీఏసీ సభ్యుడిగా సీఎం రమేష్‌ పనిచేస్తున్నారు. దేశంలో ఐటీ దాడులు ఎక్కడ, ఎందుకు చేస్తున్నారు?.. ఏపీలో దాడుల వివరాలు ఇవ్వాలంటూ పీఏసీ సభ్యుడిగా ఐటీశాఖకు సీఎం రమేష్  నోటీసులిచ్చారు. నోటీసులు జారీ చేసిన మూడు రోజుల్లోనే రమేష్‌ ఆస్తులపై దాడులు చేయడం గమనార్హం.
 

Follow Us:
Download App:
  • android
  • ios