తృణధాన్యాల రుచికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైమరచిపోయారు. గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఏర్పాటుచేసిన జీరో బేస్డ్ ప్రకృతిక వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్‌ను సీఎం ప్రారంభించారు.
తృణధాన్యాల రుచికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైమరచిపోయారు. గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఏర్పాటుచేసిన జీరో బేస్డ్ ప్రకృతిక వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్‌ను సీఎం ప్రారంభించారు.
ఈ సందర్భంగా తృణధాన్యాలతో రూపొందించిన ఆహార పదార్థాల స్టాల్‌ను సందర్శించి.. తృణధాన్యాల కేక్‌ను సీఎం రుచిచూసి.. ప్రశంసించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల స్థాయిలో మనం రూపొందిస్తున్న సాంప్రదాయ వ్యవసాయం పద్ధతులను అంతర్జాతీయ స్థాయిలో వివరించామన్నారు.

ప్రకృతి వ్యవసాయం పద్ధతులపై రైతులు, వారి కుటుంబాలకు జరుగుతున్న మేలు, భూసారానికి జరుగుతున్న మేలు గురించి చర్చించామన్నారు. అత్యంత పౌష్టిక విలువలు కలిగిన ఆహారపు అలవాట్లు ముఖ్యమని..సాంప్రదాయ రీతులలో పండించే వ్యవసాయ ఉత్పత్తులు ప్రకృతికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని సీఎం పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జడ్బీఎన్ఎఫ్ ఆహార ఉత్పత్తులపై కేస్ స్టడీ చేసి ఆ ఉత్పత్తులకు మరింత మార్కెటింగ్ సదుపాయాలు పెంపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అనంతరం వివిధ స్టాళ్ల ప్రతినిధులు తమ ఉత్పత్తుల గురించి ముఖ్యమంత్రికి వివరించారు.