గన్నవరం వైసీపీ పంచాయతీ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. పోలీస్ స్టేషన్‌కు రెండు వర్గాలు చేరుకున్నాయి. గన్నవరంలో ఇవాళ ఉదయం ఎమ్మెల్యే వంశీకి చెందిన రెండు వర్గాలు గొడవకి దిగాయి.

ముప్పనేని రవికుమార్, కాసరనేని రంగబాబు, గోపాలరావుతో పాటు మరికొందరు పరస్పరం తోసుకున్నారు. దీంతో అడ్డుకున్న వాళ్లు సర్దిచెప్పడంతో అప్పటికి ఆ రగడ అలా ముగిసింది.

కానీ ఎవరూ తగ్గకపోవడంతో ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. పోలీసులు ఎంతగా ప్రయత్నించినా రెండు వర్గాల మధ్య రాజీ కుదరలేదు. ఇప్పటికే వర్గపోరుతో సతమతమవుతున్న వంశీకి తాజా గొడవలు మరిన్ని తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.