Asianet News TeluguAsianet News Telugu

దారి తప్పిన ఉపాధ్యాయుడు.. ఐదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు..

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తన విద్యార్థుల పట్ల కామాంధుడిగా ప్రవర్తించాడు. లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన బాపట్లలో గురువారం చోటుచేసుకుంది.

Class 5 student sexually assaulted by a teacher in Bapatal KRJ
Author
First Published Oct 27, 2023, 6:51 AM IST

దేశంలో రోజురోజుకు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్నో కఠినతరమైన చట్టాలను రూపొందించి అమలు చేస్తున్న ఫలితం లేకుండా పోతుంది. కామాంధులు తీరులో కూడా ఎలాంటి రావడం లేదు. చట్టాలను ఏమాత్రం లెక్కచేయకుండా మృగాల రెచ్చిపోతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

విద్యార్థులకు దిశానిర్ధేశం చేస్తూ.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు దారి తప్పాడు. ఉపాధ్యాయుడు వృత్తికే మాయని మచ్చలా ప్రవర్తించాడు. సమాజంలో నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు.. కీచకుడిగా వ్యవహరించాడు. ఐదో విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బాపట్లలో ఆలస్యంగా గురువారం చోటుచేసుకుంది. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల పట్టణంలోని మల్లికార్జున బృందావనం కాలనీ పురపాలక ప్రాథమిక పాఠశాలలో పి. రామచంద్రరావు ప్రధానోపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధినుల పట్ల ఆ ప్రధానోపాధ్యాయుడు  అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థినులతో అసభ్యకరంగా మాట్లాడుతూ తప్పుడు పనులు చేసేవాడు. 

ఎక్కాలు చెబుతానంటూ బాలికను ఒంటరిగా గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించి, తగలరాని చోట తాకుతూ వాంఛను తీర్చుకునే యత్నం చేసేవాడు. బాధిత విద్యార్థిని ఇంటికి వెళ్లినా తరువాత తన తల్లిదండ్రులకు జరిగిన దారుణం తెలియజేస్తూ.. బోరున విలపించింది. వారు మరుసటి రోజు పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు. దీంతో ఉపాధ్యాయుడు అక్కడి నుంచి జారుకున్నారు. 

దీంతో బాధిత తల్లిదండ్రులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios