దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఆయనను అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తలతుచుకుంటున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లోని పలు వైసీపీ కార్యాలయాల్లో వర్థంతి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. కాగా.. ఈ వర్థంతి కార్యక్రమాల్లో వివాదం తలెత్తింది.

గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు మండలం బోరుపాలెంలో వైసీపీలోని రెండు గ్రూపుల మధ్య వివాదం చోటు చేసుకుంది. వైఎస్సార్ 11వ వర్థంతి సందర్భంగా  వైఎస్ విగ్రహానికి పూలమాల వేసందుకు మండల పార్టీ అధ్యక్షుడు మాదల మహేంద్ర గ్రామానికి వచ్చారు. అయితే తమకు సమాచారం ఇవ్వకుండా గ్రామంలోకి ఎందుకు వచ్చారంటూ మండల పార్టీ అధ్యక్షుడిని రెండవ వర్గం అడ్డుకుంది. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.