పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామంలో సత్తెమ్మ దేవతకు కొలుపులు సమర్పించే విషయంలో వివాదం రాజుకుంది.

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. వెల్దుర్ది మండలం గొట్టిపాళ్ల గ్రామంలో ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. గ్రామంలో సత్తెమ్మ దేవతకు కొలుపులు సమర్పించే విషయంలో వివాదం రాజుకుంది. దీంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగారు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.