కర్నూల్: కర్నూల్ జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడబూరు మండలం హనుమాపురంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య శుక్రవారం నాడు ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు.

భూ వివాదం విషయమై గ్రామంలో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘర్షణలో టీడీపీ నేత తిక్కారెడ్డి వర్గానికి చెందిన 11 మంది, మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి వర్గానికి చెందిన ఆరుగురు గాయపడ్డారు. 

పెద్ద ఎల్లయప్ప, పెద్దయ్యల మధ్య భూ వివాదం చోటు చేసుకొంది.  వీరిద్దరూ కూడ వేర్వేరు పార్టీలో ఉన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన తర్వాత కూడ ఇరు వర్గాలకు చెందిన వారు వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రితో పాటు గ్రామంలో కూడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మంత్రాలయం నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన తర్వాతి నుండి పలు గ్రామాల్లో ఘర్షణలు చోటు చేసుకొంటున్నాయి.