గుంటూరు: గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో  అధికార వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.  గురువారం నాడు తురకపాలెంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త అల్లాద్దీన్ గాయపడ్డారు.

ఎన్నికల తర్వాత గుంటూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా  పల్నాడు ప్రాంతంలో  ఈ దాడులు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ ఘర్షణలను నివారించేందుకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా కూడ పరిస్థితుల్లో మార్పులు రాలేదు.

తాజాగా గురువారం నాడు తురకపాలెంలో  టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీ కార్యకర్త అల్లాద్దీన్ గాయపడ్డారు. అల్లాద్దీన్‌పై దాడికి దిగిన ప్రత్యర్థులు  పారిపోయారు. ఈ ఘటనపై అల్లాద్దీన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.