నంద్యాల మున్సిపాలిటీలో అధికారుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ముఖ్యంగా కమీషనర్ వర్సెస్ అసిస్టెంట్ కమీషనర్ అన్నట్లుగా పరిస్ధితి నెలకొంది. కమీషనర్ ఎదుటే మెమో కాపీలను చింపేశారు అసిస్టెంట్ కమీషనర్. కమీషనర్‌గా పనిచేశానని.. రూల్స్ తనకు తెలుసునంటూ వాగ్వాదానికి దిగారు. 

నంద్యాల మున్సిపాలిటీలో అధికారుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ముఖ్యంగా కమీషనర్ వర్సెస్ అసిస్టెంట్ కమీషనర్ అన్నట్లుగా పరిస్ధితి నెలకొంది. సచివాలయ సిబ్బంది కేటాయింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం క్లర్క్, మేనేజర్‌కు మెమోలు జారీ చేశారు అధికారులు. అలాగే నిర్లక్ష్యం వహించారని అసిస్టెంట్ కమీషనర్ మోహన్‌దాస్‌కు కూడా మెమో జారీ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అసిస్టెంట్ కమీషనర్ మోహన్‌దాస్... కమీషనర్‌పై స్థిరపడ్డారు. కమీషనర్ ఎదుటే మెమో కాపీలను చింపేశారు అసిస్టెంట్ కమీషనర్. కమీషనర్‌గా పనిచేశానని.. రూల్స్ తనకు తెలుసునంటూ వాగ్వాదానికి దిగారు. అంతేకాదు ఛైర్‌పర్సన్‌కు ఫిర్యాదు చేశారు అసిస్టెంట్ కమీషనర్. అధికారుల మధ్య విభేదాలతో సిబ్బందిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.