ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు మరోసారి బయటపడింది. వైసీపీ కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి వరికూటి అశోక్‌బాబు, పీడీసీసీ బ్యాంకు మాదాసి వెంకయ్య వర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది.

ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు మరోసారి బయటపడింది. వైసీపీ కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి వరికూటి అశోక్‌బాబు, పీడీసీసీ బ్యాంకు మాదాసి వెంకయ్య వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే అశోక్‌బాబు అనుచరులు వీరంగం సృష్టించారు. మాదాసి వెంకయ్యపై దాడికి యత్నించారు. ఈ క్రమంలోనే అడ్డుపడిన మాదాసి వెంకయ్య అనుచరుల్లో కొందరికి గాయాలయ్యాయి. వివరాలు.. టంగుటూరు జాతీయ రహదారిపై ఓ టీ దుకాణం వద్ద అశోక్‌బాబు, మాదాసి వెంకయ్య వర్గీయుల మధ్య మాటామాటా పెరిగింది. 

ఈ క్రమంలోనే అశోక్‌బాబు, మాదాసి వెంకయ్య వర్గం నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. మాదాసి వెంకయ్యపై అశోక్‌బాబు అనుచరులు దాడికి యత్నించారు. అయితే వెంకయ్యను ఆయన అనుచరులు వాహనం ఎక్కించి పంపించారు.ఈ ఘర్షణలో వెంకయ్య అనుచరుల్లో కొందరికి గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు.