నటన అంత సులభం కాదు...సుమన్

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 26, Aug 2018, 11:51 AM IST
cini actor suman comments
Highlights

నటన అంత సులభం కాదని తొలిరోజు షూటింగ్ తో సినిమాలు మానేద్దామనుకున్నానని సినీనటుడు సుమన్ మనసులో మాట వెల్లడించారు. సినీ ప్రస్థానంలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరులో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మురళీ కృష్ణ నటుడు సుమన్ ను ఘనంగా 

గుంటూరు: నటన అంత సులభం కాదని తొలిరోజు షూటింగ్ తో సినిమాలు మానేద్దామనుకున్నానని సినీనటుడు సుమన్ మనసులో మాట వెల్లడించారు. సినీ ప్రస్థానంలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరులో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మురళీ కృష్ణ నటుడు సుమన్ ను ఘనంగా సన్మానించారు. అందరి సహకారంతో తొమ్మిది బాషల్లో 400 చిత్రాల్లో నటించానని సుమన్ స్పష్టం చేశారు. తెలుగు, మరాఠీ, హిందీతోపాటు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించానని చెప్పుకొచ్చారు.  

కెమెరా ముందుకు వచ్చిన మొదటి రోజున నటన అంత సులభం కాదు మానేద్దాం అనుకున్నానని ఆ సమయంలో మిత్రులు, శ్రేయోభిలాషులు ఇచ్చిన ధైర్యంతో రెండోరోజు షూటింగ్‌కు వెళ్లానని గుర్తు చేసుకున్నారు. చిత్రరంగంలో ఎటువంటి సంబంధాలు లేకపోయినా ఎందరో డైరెక్టర్లు, కో అర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్లు ఇచ్చిన సహకారంతో ఈ స్థాయికి వచ్చానన్నారు. 

తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాని అయితే  కరాటే తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు. స్వయంకృషిని నమ్ముకొని ప్రణాళికాబద్ధంగా ముందుకువెళితే విజయాలు సొంతమవుతాయ సుమన్  అభిప్రాయపడ్డారు.

తనకు రాజకీయ గురువు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. పదవి ఆశించకుండా టీడీపీకి ప్రచారం చేశానన్నారు. నటన, రాజకీయం నాకు రెండు కళ్ళు అని సుమన్‌ పేర్కొన్నారు.  

loader