జగన్ కి పెరుగుతున్న సినీ నటుల మద్దతు

వైసీపీకి రోజు రోజుకీ మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు తమ పార్టీలను వీడి వైసీపీ చెంతకు చేరుతున్న సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా వైసీపీ సినీ గ్లామర్ కూడా జతచేరింది. మొన్నటికి మొన్న ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి జగన్ కి మద్దతు తెలిపారు. అంతేకాదు ఆయనతోపాటు పాదయాత్రలో నడిచారు కూడా. జగన్ ని ఆకాశానికి ఎత్తేస్తూ.. అధికార ప్రభుత్వంపై పలు విమర్శలు కూడా చేశారు.

తాజాగా.. మరో సినీ నటడుు పృథ్వీ కూడా జగన్ కి మద్దతుగా నిలిచాడు. ప్రతిపక్ష నేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో సాగుతోంది. 175వ రోజు పాదయాత్రలో ఉన్న జగన్‌ను సినీ నటుడు పృథ్వీరాజ్ కలిశారు. భీమవరం నియోజకవర్గం వీరవాసరం వద్ద జగన్‌ను కలిసిన పృథ్వీరాజ్ జగన్‌తో ముచ్చటిస్తూనే.. చేతిలో చేయి వేసి వైసీపీ జెండా భుజన వేసుకొని పాదయాత్రలో కొనసాగారు. 

ఇదిలా ఉండగా.. పోసాని, పృథ్వీ ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రస్తుతం ప్రచారం ఊపందుకుంది. అందుకోసమే వారు జనగ్ ని పాదయాత్రలో
కలిశారని సమాచారం.