హైదరాబాద్: సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు  టీడీపీలో చేరనున్నారు.  ఇటీవలనే ఆదిశేషగిరి రావు వైసీపీకి రాజీనామా చేశారు.ఫిబ్రవరి  7 లేదా 8 తేదీల్లో  టీడీపీల్లో చేరనున్నారని తెలుస్తోంది.

సినీ నటుడు కృష్ణ  సోదరుడు ఆదిశేషగిరి రావు.  ఆదిశేషగిరిరావు తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. వైసీపీకి ఇటీవలనే  ఆదిశేషగిరిరావు  రాజీనామా చేశారు.

ఆదిశేషగిరిరావు  టీడీపీలో చేరనున్నారని  కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఫిబ్రవరి7 లేదా 8 తేదీల్లో  టీడీపీలో చేరనున్నారని సమాచారం.  సినీ నటుడు కృష్ణ అభిమాన సంఘాలతో ఆదిశేషగిరిరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కృష్ణ అభిమాన సంఘాలతో ఆదిశేషగిరి రావు చర్చించిన తర్వాత ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకొన్నారని చెబుతున్నారు.