సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

అమరావతి: ఏపీ మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలపై  మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి బహిరంగంగా  క్షమాపణలు చెప్పాలని సినీ నటి, బీజేపీ నేత కుష్బూ డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా  కుష్బూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆర్‌కే రోజాపై టీడీపీనేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి  చేసిన వ్యాఖ్యలు  వివాదాస్పదమయ్యాయి.  చంద్రబాబు సహా, నందమూరి, నారా కుటుంబాలపై  ఏపీ మంత్రి రోజా విమర్శలు చేశారు.ఈ విమర్శలపై మాజీ మంత్రి  బండారు సత్యనారాయణమూర్తి విమర్శలు చేశారు. రోజా గురించి తాము మాట్లాడితే  ఆమె కుటుంబ సభ్యులు  ఆత్మహత్య చేసుకుంటారని కూడ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆమె సినిమాల్లో ఆమె చేసిన పాత్రల గురించి ఆరోపణలు చేశారు.  చంద్రబాబు కుటుంబంపై చేసిన విమర్శలకు క్షమాపణ చెప్పకపోతే రోజా సినిమాలకు సంబంధించిన చిత్రాలను బయట పెడతానని  వార్నింగ్ ఇచ్చారు.ఈ వ్యాఖ్యలపై  బండారు సత్యనారాయణమూర్తిపై  కేసు నమోదైంది. 

also read:రోజా ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది .. బుద్ధి చెప్పా , మమ్మల్ని భయపెట్టలేరు : బండారు సత్యనారాయణ మూర్తి

ఈ వ్యాఖ్యలపై  సినీ నటి, బీజేపీ నేత కుష్బూ స్పందించారు. ఏపీ మంత్రి రోజాపై  అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణమూర్తి క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మనిషిగా కూడ  బండారు సత్యనారాయణమూర్తి విఫలమయ్యారని ఆమె వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రి రోజాకు ఆమె బాసటగా నిలిచారు. బండారు సత్యనారాయణమూర్తి క్షమాపణ చెప్పేవరకు  తాను పోరాటం చేస్తానని వ్యాఖ్యానించారు. ఎక్స్ వేదికగా  ఈ మేరకు ఆమె ఓ వీడియోను పోస్టు చేశారు.

 

ఏపీ మంత్రి రోజాతో పాాటు ఏపీ సీఎం వైఎస్ జగన్ పై  మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను  బండారు సత్యనారాయణపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసులో ఈ నెల 2న  బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో బండారు సత్యనారాయణమూర్తికి బెయిల్ లభించింది.