కారణమిదీ: గుంటూరు పీహెచ్‌సీల్లో సీఐడీ తనిఖీలు

గుంటూరు జిల్లాలోని బాపట్లలోని అప్పికట్ల, వెదుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సోమవారం నాడు సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
 

CID searches at baptla PHC in Guntur distrct lns

అమరావతి: గుంటూరు జిల్లాలోని బాపట్లలోని అప్పికట్ల, వెదుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సోమవారం నాడు సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.2018లో బయో మెడికల్ పరికరాల నిర్వహణలో అక్రమాలు జరిగాయని కేసు నమోదైంది. ఈ కేసు నేపథ్యంలో సీఐడీ అధికారులు  ఇవాళ  తనిఖీలు చేపట్టారు. 

పీహెచ్‌సీల్లోని రికార్డులు,  పరికరాలను పరిశీలిస్తున్న సీఐడీ అధికారులు పరిశీలిస్తున్నారు.ప్రభుత్వ నిధులను కొందరు అక్రమార్కులు తమ జేబుల్లోకి మళ్లించారని ఫిర్యాదులు అందాయి. ఈ విషయమై సీఐడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది.ఈ రెండు పీహెచ్‌సీల్లోనే ఈ తరహా అవకతవకలు చోటు చేసుకొన్నాయా లేదా ఇతర పీహెచ్‌సీల్లో కూడా ఇలానే ఉందా అనే విషయమై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే ఈఎస్ఐ కుంభకోణం రాజకీయంగా  పెద్ద సంచలనంగా మారింది.ఈ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బెయిల్ పై ఆయన విడుదలయ్యారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనను ఈ కేసులో ఇరికించారని అచ్చెన్నాయుడు అప్పట్లో విమర్శించిన విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios