మాజీ మంత్రి నారాయణ అల్లుడికి సిఐడీ నోటీసులు..
మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కు ఏపీ సీఐడీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నోటీసులు జారీ చేసింది. 11వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరింది.

అమరావతి : ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 11న సిఐడి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే సిఐడి నోటీసులను క్యాష్ చేయాలని ఏపీ హైకోర్టులో పునీత్ పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్ మీద ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది.
కాగా, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు సోమవారం మరో నలుగురి పేర్లను కేసులో చేర్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏసీబీ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు. మాజీమంత్రి నారాయణ భార్య రమాదేవి, ఆవుల మణిశంకర్, సాంబశివరావు, ప్రమీల పేర్లను సోమవారంనాడు చేర్చి మెమో దాఖలు చేశారు.
తమకు చెందిన వారికి లాభం చేకూరేలా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంటులో మార్పులు చేశారని మాజీమంత్రి నారాయణ, చంద్రబాబులపై ఏసీ సీఐడీ ఐఆర్ఆర్ అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే.