విజయవాడ ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో పీటీ వారెంట్ నమోదైంది. ఫైబర్ నెట్ కేసులో ఆయనను నిందితుడిగా పేర్కొంటూ పీటీ వారెంట్ నమోదైనట్లుగా తెలుస్తోంది.

విజయవాడ ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో పీటీ వారెంట్ నమోదైంది. ఫైబర్ నెట్ కేసులో ఆయనను నిందితుడిగా పేర్కొంటూ పీటీ వారెంట్ నమోదైనట్లుగా తెలుస్తోంది. టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ దాఖలు చేసింది సీఐడీ. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్‌పై చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ నమోదైన సంగతి తెలిసిందే. 

ఇదిలావుండగా.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పును ఏపీ హైకోర్టు మంగళవారం నాడు రిజర్వ్ చేసింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని, రిమాండ్ ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుండి వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే , సిద్దార్థ్ లూథ్రాలు వాదించారు.

ALso Read: చంద్రబాబు క్వాష్ పిటిషన్: ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్

ఏపీ సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. చంద్రబాబు అరెస్ట్ ప్రక్రియ నిబంధనలకు విరుద్దంగా జరిగిందని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. కానీ ఈ వాదనలను ఏపీ సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ తోసిపుచ్చారు. అన్ని సాక్ష్యాలను సేకరించిన తర్వాతే చంద్రబాబును అరెస్ట్ చేసినట్టుగా రోహత్గీ చెప్పారు