మైనర్ బాలికపై సీఐ కారు డ్రైవర్ అత్యాచారయత్నం

CI Car Driver attempt to Rape Girl in Guntur
Highlights

దేశవ్యాప్తంగా చిన్నారులపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మహిళలు, చిన్నారుల కోసం ఎన్ని కఠిన చట్టాలు రూపొందించిన ఈ దారుణాలు ఆగడం లేదు. ఈ చట్టాల గురించి తెలిసిన వ్యక్తులే ఇలాంటి దారుణాలకు పాల్పడటం ఆందోళకకరమైన విషయం.

తాజాగా ఓ మైనర్ బాలికపై  గుంటూరు జిల్లాలో ఓ కారు డ్రైవర్ అత్యాచారయత్నం చేశాడు. గుంటూరు పట్టణంలో నివాసముండే ఓ సీఐ వద్ద నిందితుడు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతడు బాలికపై అత్యాచారయత్నం చేయగా భచపడిపోయిన చిన్నారి గట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చేలోపు నిందితుడు పరారయ్యాడు.

ఈ ఘటనపై స్థానికులు నల్లపాడు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి పట్టాభిపురం సీఐ గా డ్రైవర్ జానీ గా గుర్తించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జానీ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
loader