అక్రమ అరెస్టులు చేయాలంటూ ఆనందరావుపై ఒత్తిడి తేవడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. 

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. రాజకీయ ఒత్తిళ్ళతోనే సిఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టాలని సీఐ ఆనందరావుపై ఒత్తిళ్లు పెరిగాయని ఆయన అన్నారు. నిన్న డీఎస్పీ ఆఫీస్ కు సీఐ ఆనందరావు వెళ్లాడన్నారు. సీఐ ఎవరెవరిని కలిశాడో విచారణ జరిగిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 

మరోవైపు, ఆత్మహత్య చేసుకున్న సీఐ ఆనందరావు కుటుంబాన్ని ఎస్పీ శ్రీనివాసరావు కలిశారు. ఆయన తాడిపత్రి చేరుకుని ఆనందరావు కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆత్మహత్య గురించి ఆరా తీశారు. పనిఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీఐ ఆనందరావు కూతురు భవ్య తెలిపింది. గతంలో ఆనందరావు తిరుపతి, కడపలో పనిచేశాడని సిఐ కూతురు భవ్య తెలిపింది. తాజాగా తాడిపత్రికి వచ్చారని. తాడిపత్రిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చింది. 

విషాదం.. తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య...