మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి(ఎస్​డీపీవో) నుంచి చంద్రబాబుకు సీఆర్​పీసీ 91 నోటీసులు జారీ చేశారు.

పుంగనూరు దళిత యువకుడు ఓం ప్రతాప్ మృతికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. అంతకుముందు ఓం ప్రతాప్ మృతిపై డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. ఆగస్ట్ 27 న దినపత్రికల్లో కథనాన్ని నోటీసులో ప్రస్తావించారు.

మీ దగ్గర ఉన్న సమాచారం, సాక్ష్యాధారాలను అందజేయాలని నోటీసులో చంద్రబాబును కోరారు మదనపల్లి పోలీసులు. నోటీసు అందిన వారం రోజుల్లోగా, తమ కార్యాలయానికి హాజరై సమాచారం ఇవ్వాలని చంద్రబాబును కోరారు.