ఒంగోలు:తన పేరును ఉచ్చరించేందుకు భయపడేవారు కూడ వార్నింగ్ ఇస్తారా అని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రశ్నించారు.

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో విబేధాలు రచ్చకెక్కాయి. కరణం వెంకటేష్, ఆమంచి కృష్ణమోహన్ లు బహిరంగంగానే పరస్పరం ఆరోపణలు చేసుకొన్నారు. 

జగన్ కాళ్లు పట్టుకొని పార్టీలో చేరి బతికిపోయారని పరోక్షంగా కరణం బలరాం  కుటుంబంపై ఆయన విమర్శలు చేశారు. అధికారం లేకుండా ఎక్కడా బతకలేని వాళ్లు తన గురించి మాట్లాడుతారా అని ఆయన ప్రశ్నించారు. 

also read:చీరాల వైసీపీలో వర్గపోరు: ఆమంచికి కరణం వెంకటేష్ వార్నింగ్

తనకు వార్నింగ్ ఇచ్చినట్టు వచ్చిన వార్తలు ఖండిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.ఇవాళ చీరాలలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా కరణం వెంకటేష్ వర్గం, మాజీ ఎమ్మెల్యే  ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు పోటా పోటీగా నిర్వహించారు.

2018 ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ పై టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కరణం బలరాం విజయం సాధించారు. ఇటీవల కాలంలో కరణం వెంకటేష్ టీడీపీ నుండి వైసీపీలో చేరారు. కరణం బలరాం మాత్రం వైసీపీలో చేరలేదు. కానీ జగన్ కు మద్దతుగా నిలిచారు.