ఏలూరు: తనపై పోలీసులు పెట్టిన కేసులపై తెలుగుదేశం మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. "మీ అరెస్టులు మమ్మల్ని భయపెట్టలేవు. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్తా, దేనికైనా తెగిస్తా" అని ఆయన అన్నారు.

వ్యాఖ్యలపై చింతమనేని అభిమానులు, టీడీపీ కార్యకర్తలు స్పందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆయనను కొన్నాళ్ల క్రితం అరెెస్టు చేశారు. 

Also Read: వెంటాడుతున్న కేసులు: మరో కేసులో చింతమనేని రిమాండ్

అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలపై ముఖ్యమంత్రి వైఎఎస్ జగన్ ప్రభుత్వం కేసులతో ఇబ్బంది పెడుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ అరెస్టుల వ్యవహారంపై తాజాగా చింతమనేని ట్విట్టర్ వేదికగా స్పందించారు. 

ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేసిన చింతమనేని ప్రభాకర్ ఓటమి పాలయ్యారు. వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రాగానే చింతమనేనిపై ఉన్న పాత కేసులను తిరగదోడుతున్నారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పలు కేసులను ఎదుర్కుంటున్నారు.

Also Read: అజ్ఞాతం వీడిన చింతమనేని: భార్యను చూసేందుకు వెళ్తుండగా అరెస్ట్