Asianet News TeluguAsianet News Telugu

చింతలపూడి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

ఆంధ్ర ప్రదేశ్ లోని షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) రిజర్వ్ చేసిన నియోజకవర్గాల్లో చింతలపూడి ఒకటి. ఇది ఏలూరు జిల్లాకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి విజయం సాధించింది. ప్రస్తుత ఎమ్మెల్యేగా వున్నమట్ల ఎలిజా వున్నారు. అయితే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కనబెట్టి కొత్తవారిని బరిలోకి దింపారు వైసిపి అధినేత వైఎస్ జగన్. దీంతో చింతలపూడి ప్రజల తీర్పు ఎలా వుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. 

Chintalapudi assembly elections result 2024 AKP
Author
First Published Mar 19, 2024, 6:59 PM IST

చింతలపూడి రాజకీయాలు :  

చింతలపూడిలో తెలుగుదేశం పార్టీ ముందునుండి బలంగా వుంది. ఇక్కడినుండి కోటగిరి విద్యాధరరావు 1983 లో స్వతంత్రంగా పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత టిడిపిలో చేరిన ఆయన వరుసగా 1985,1989,1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి చింతలపూడి ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత 2014 లో మరోసారి పీతల సుజాత టిడిపి నుండి పోటీచేసి గెలిచారు. అయితే గత ఎన్నికల్లో వైసిపి గాలి రాష్ట్రవ్యాప్తంగా వీయడంతో చింతలపూడిలో  విఆర్ ఎలిజా విజయం సాధించారు. 

ఇదిలావుంటే 2004, 2009 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ చింతలపూడి కాంగ్రెస్ వశమయ్యింది.  2004లో ఘంటా మురళీ రామకృష్ణ, 2009లో మద్దాల రాజేష్ కుమార్ చింతలపూడిలో గెలిచారు.

చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. లింగపాలెం
2. చింతలపూడి
3.  కమవరపుకోట
4.  జంగారెడ్డిగూడెం

చింతలపూడి అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,63,398
పురుషులు -  1,30,840
మహిళలు ‌-   1,32,514

ఉంగుటూరు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

చింతలపూడిలో వైసిపి అభ్యర్థిని మార్చి ప్రయోగం చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎలీజాను పక్కనపెట్టి కొత్తగా కంభం విజయరాజును బరిలోకి దించుతున్నారు వైసిసి అధినేత వైఎస్ జగన్.   

టిడిపి అభ్యర్థి : 

మాజీ మంత్రి, గతంలో చింతలపూడి ఎమ్మెల్యేగా పనిచేసిన పీతల సుజాతకు టిడిపి టికెట్ దక్కలేదు. ఆమెను కాదని సొంగా రోషన్ కు అవకాశం ఇచ్చారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. 

చింతలపూడి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

చింతలపూడి అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 2,16,232 (84 శాతం)

వైసిపి - ఎలీజా    - 1,15,755 ఓట్లు (53 శాతం) - 36,175 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - కర్రా రాజారావు - 79,580 (36 శాతం) - ఓటమి

చింతలపూడి అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -   2,02,553 (84 శాతం)

టిడిపి - పీతల సుజాత  - 1,05,417 (52 శాతం) ‌-  15,164 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - బుర్లా దేవిప్రియ  - 90,253 (44 శాతం) - ఓటమి 


 

Follow Us:
Download App:
  • android
  • ios