కాంట్రాక్టర్లతో చంద్రబాబు విదేశాల్లో భేటీ?

కాంట్రాక్టర్లతో చంద్రబాబు విదేశాల్లో భేటీ?

చంద్రబాబునాయుడుపై కేంద్ర మాజీమంత్రి చింతామోహన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇంత వరకూ ఎవరూ చేయనటువంటి ఆరోపణలు చింతా మోహన్ చేయటం గమనార్హం. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లను చంద్రబాబు విదేశాలకు పిలిపించుకుంటున్నారట. విదేశాల్లోనే కాంట్రాక్టర్లతో ‘అన్నీవిషయాలు’ మాట్లాడుకుంటున్నట్లు ఆరోపణలు చేయటం సంచలనమైంది. పోలవరం ప్రాజెక్టు మొత్తం అవినీతిమయంగా మారిందని ఆరోపించారు.

ఒంగోలులో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం అప్పుల్లో ఉంటే చంద్రబాబు మాత్రం ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేస్తూ ప్రత్యేక విమానాల్లో విదేశాల్లో పర్యటిస్తున్నారని మండిపడ్డారు. ఇక కాపు ఉద్యమం గురించి మాట్లాడుతూ, కాపు వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎపిలో ప్రస్తుతం ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారని అభిప్రాయపడ్డారు. అందుకు అనుగుణంగా కాపు, ఓబిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఏకం కావాలని కూడా పిలుపునిచ్చారు లేండి.  

రాష్ట్రంలో ఆరుశాతం కూడా లేని రెండు సామాజిక వర్గాలకు చెందిన వారే ఇప్పటికీ ముఖ్యమంత్రులుగా చెలామణి అయ్యే పరిస్థితి మారాలన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని ఇతర సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును డిమాండ్ చేసారు. దేశంలోని సముద్ర తీర ప్రాంతాల్లో నౌకాశ్రయాలు ఎక్కువగా రావాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క గుజరాత్‌ రాష్ట్రంలోనే పది పోర్టులు ఉన్నాయని, ఇవన్నీ ప్రధాని మోడీకి సన్నిహితుడైన వ్యాపారవేత్త అదానీ చేతిలో ఉన్నాయన్నారు.

ఎపిలో పోర్టు రాకుండా అదానీయే అడ్డుపడుతున్నారన్నారని ధ్వజమెత్తారు. అదానీ వ్యాపార సంస్థల కోసం ప్రధాని మోడీ ఆస్ట్రేలియా నుంచి  రూ. 90 వేల కోట్ల రుణం ఇప్పించారని ఆరోపించారు. భీమునిపట్నం నుంచి దుగ్గరాజుపట్నం వరకు కనీసం ఐదు పోర్టులు రావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే దేశంలో ఎక్కడ పోర్టు రావాలన్నా అదానీ ఆమోదం లేకుండా మోడీ ఆమోద ముద్ర వేయడం లేదన్నారు. ప్రకాశంజిల్లాను మురికి కాలువ తొ పోల్చారు. తమకు ప్రాంతీయాభిమానం ఉండటం వల్లె దుగ్గరాజు పట్నం పోర్టు సాదించామన్నారు. ప్రకాశం జిల్లా ఎమ్.పి లు ౘతగాని వాళ్ళు కాబట్టే రామాయపట్నం పోర్టు రాలేదన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos