ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి... శుక్రవారం గండి నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. చక్రాయపేట మండల కేంద్రంలోని గండి వీరాంజనేయస్వామిని ముందుగా రాయచోటి శాసనసభ్యుడు, ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి దర్శించుకున్నారు. వీరాంజనేయ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

అనంతరం గండి నుండి ఆయన బృందంతో ఆధ్యాత్మిక తిరుమల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు..వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని గతంలో కోరుకున్నట్లు  చెప్పారు.

వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ..లోక కల్యాణం కోసం కోరుకున్నానని.. ఇప్పుడు స్వామివారి మొక్కు తీర్చుకునేందుకు తాను ఈ పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు.తన జీవితం ఉన్నంతకాలం రాయచోటి ప్రజలకు రుణ పడి ఉంటామని చెప్పారు.ఈ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో చక్రాయపేట మండల వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.