చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో విచిత్రమైన సంఘటన జరిగింది. యువతీయువకులు కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నిారు, వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే, యువకుడు తల్లిదండ్రులు నిర్ణయించిన పెళ్లి సంబంధానికి అంగీకరించాడు. ఇది తెలుసుకున్న అతని ప్రేయసి బెంగళూరు నుంచి ఆఘమేఘాల మీద వచ్చింది. 

ఆమె వచ్చేసరికి పెళ్లి అయిపోయింది. దాంతో యువతి అతన్ని నిలదీసింది. దాంతో యువకుడి బంధువులు యువతిపై దౌర్జన్యం చేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన గంగవరం మండలంలోని మిట్టమీద కురప్పల్లెలో శుక్రవారం జ0రిగింది.

అందుకు సంబంధించిన వివరాలను యువతి వివరించింది. ఆమె కథనం ప్రకారం... పెద్దపంజాణి మండలానికి ెచందిన ఓ యువతి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అదే కంపెనీలో పనిచేస్తున్న గంగవరం మండలం మిట్టమీద కురప్పల్లెకు చెందిన గణేష్ తో పరిచయం ఏర్పడి, అది ప్రేమకు దారి తీసింది. ఆరేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. 

పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తమ తమ పెద్దలకు కూడా చెప్పారు. ఈలోగా కోవిడ్ లక్షణాలున్నాయంటూ మూడు నెలల క్రితం గణేష్ స్వగ్రామానికి వచ్చాడు. కాగా, గణేష్ కు కుటుంబ సభ్యులు బంధువుల అమ్మాయితో పెళ్లి కుదిర్చారు. పెద్దపంజాణి మండలం అప్పినపల్లెకు చెందిన  యువతితో గణేష్ స్వగృహంలో గురువారం వేకువ జామున వారికి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేశారు. 

గణేష్ మిత్రుల ద్వారా సమాచారం అందుకున్న యువతి బెంగుళూరు నుంచి మిట్టమీద కురప్పల్లెకు వచ్చింది. ఆమె వచ్చేలోగా గణేష్ వివాహం జరిగిపోయింది. దాంతో గంగవరం, పెద్దపంజాణి పోలీసులకు యువతి పిర్యాదు చేసింది. గురువారం రాత్రి వధువు ఇంటి వద్ద తొలి రాత్రికి ఏర్పాట్లు చేసుకున్నారని తెలిసి అక్కడికి వెళ్లింది.

తన ప్రియుడిని నిలదీసింది. దాంతో అక్కడి వ్యక్తులు ఆమెపై దౌర్జన్యం చేశారు. దానిపై పెద్దపంజాణి పోలీసులు కేసు నమోదు చేశారు. గణేష్ ను పట్టుకోవడానికి ప్రయత్నించారు ఈ విషయం తెలుసుకున్న వధూవరులు శోభనం రాత్రికి తిలోదకాలిచ్చి పారిపోయారు.