ఇప్పటికే బలవంతపు వసూళ్లు, భూ కబ్జాలు, మోసాలతో టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై ఫిర్యాదుల పరంపర ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఆయన కుమార్తె డాక్టర్ పునాటి విజయలక్ష్మీపై మరో కేసు నమోదైంది.

ఆరోగ్యశ్రీ పర్మిషన్ పేరుతో తనను మోసం చేశారంటూ డాక్టర్ చక్రవర్తి బుధవారం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన నుంచి విజయలక్ష్మీ నాలుగు లక్షలు వసూలు చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విజయలక్ష్మీతో పాటు బొమ్మిశెట్టి శ్రీను, పోట్ల ప్రసాద్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు.