విశాఖ దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త.. భార్య, కుమార్తెను రైల్వే స్టేషన్‌లో వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆ ఇల్లాలు న్యాయం కోసం భర్త ఇంటికి వెళ్లగా.. ఆదుకోవాల్సిన అత్తగారు ... ఇంటికి తాళం వేసి లోనికి రాకుండా అడ్డుకుంది.

దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ అత్తగారింటి ముందు ఆందోళనకు దిగింది. గత కొన్ని రోజులుగా తనను అదనపు కట్నం తీసుకురావాల్సిందిగా అత్త, భర్త వేధిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.