చంద్ర‌బాబు మైనార్టీల‌పై ముస‌లి క‌న్నీరు కురిపిస్తున్నారన్న పార్థసారథీ. ఎన్నిక‌ దగ్గ‌ర ప‌డుతుంటే టీడీపీలో వ‌ణుకు మెద‌లైందన్నారు ఓట‌మీ త‌ప్పించుకోవ‌డానికి టీడీపీ నాయ‌కులు అడ్డ‌దారులు తొక్కుతున్నారని ఆరోపణ.

నంద్యాల ఉప ఎన్నిక‌ నేప‌థ్యంలో చంద్ర‌బాబు మైనార్టీల‌పై ముస‌లి క‌న్నీరు కురిపిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు వైసీపి నేత పార్థ సార‌థీ. ముస్లీంల‌కు మూడున్న‌ర సంవత్స‌రాలుగా క్యాబినేట్‌లో చోటు ఇవ్వ‌ని చంద్ర‌బాబు ఇప్పుడే ఎందుకు అంత ప్రేమ కురిపిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. శుక్ర‌వారం నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పై విరుచుకుప‌డ్డారు. 


ఎన్నిక‌ దగ్గ‌ర ప‌డుతుంటే టీడీపీలో వ‌ణుకు మెద‌లైందని ఎద్దేవా చేశారు పార్థ‌సార‌థీ, ఓట‌మీ త‌ప్పించుకోవ‌డానికి టీడీపీ నాయ‌కులు అడ్డ‌దారులు తొక్కుతున్నార‌ని ఆరోపించారు. కోట్ల కొద్ది డ‌బ్బును వ‌ర‌ద‌లా పారిస్తున్నార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. గెలుపుకోసం అన్ని వర్గాల ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్ట‌డానికి ప్ర‌త్యేకంగా ప్ర‌ణాళిక‌ల‌తో టీడీపీ ప‌నిచేస్తుంద‌ని ఆయ‌న మిమ‌ర్శించారు. ముస్లీంను బుట్ట‌లో వేసుకోవ‌డానికే ఒక ఎమ్మెల్సీ, ఒక వ‌క్హ్‌ బోర్డు ఛైర్మ‌న్ ప‌ద‌విని ఇచ్చార‌ని ఆయ‌న ఆరోపించారు. రాబోయో ఓట‌మీకి చంద్ర‌బాబు ఇప్పుడే కార‌ణాలు వెతుకుతున్నార‌ని ఆయ‌న అన్నారు.


టీడీపీ కార్య‌కర్త‌లే చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఉన్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. చంద్ర‌బాబుకు త‌న ప‌దివి త‌ప్ప ప్ర‌జా సంక్షేమం అస్స‌లు ప‌ట్ట‌ద‌ని పార్థ‌సార‌థీ ఆరోపించారు. బాబు పాల‌న‌లో ప్ర‌జ‌లు విసిగిపోయారు క‌నుక‌నే ప్ర‌జ‌లు వైసీపి అధికారంలోకి రావాల‌ని కోరుకుంటున్నార‌ని ఆయ‌న తెలిపారు. నంద్యాల ఎన్నికలో వైసీపిని గెలిపించి టీడీపీకి బుద్ది చెబుతామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.