ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని ముంచాడు: చంద్రబాబు
ఒక్క ఛాన్స్ పేరుతో అధికారాన్ని చేపట్టి రాష్ట్రాన్ని ముంచేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మండిపడ్డారు.బ్రిటీష్ వాళ్లకంటే ఎక్కువగా దోపీడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు.
అమరావతి: ఒక్క ఛాన్స్ పేరుతో అధికారాన్ని చేపట్టి రాష్ట్రాన్ని ముంచేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మండిపడ్డారు.బ్రిటీష్ వాళ్లకంటే ఎక్కువగా దోపీడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు.కరోనా బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నిరసనకు దిగింది.ఈ నిరసన కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. భారత్ బయోటెక్ కంపెనీకి కులం రంగు పూయడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన ఈ ముఖ్యమంత్రికి బుద్ది ఉందా అని ఆయన అడిగారు.
కరోనా మృతుల విషయంలో ప్రభుత్వానికి తప్పుడు లెక్కలని ఆయన చెప్పారు. కరోనా నియంత్రణను జగన్ పట్టించుకొలేదని ఆయన మండిపడ్డారు.కరోనాపై విపక్షాల సూచనలను పట్టించుకోలేదన్నారు. చాలా దేశాల్లో కరోనా నియంత్రణపై పకడ్బందీ చర్యలు తీసుకొన్నారని ఆయన గుర్తు చేశారు.
కరోనా మృతుల వివరాలను ప్రకటించాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. కరోనా మృతుల వివరాల విషయంలో కూడ ప్రభుత్వానివి తప్పుడు లెక్కలని ఆయన చెప్పారు. బాధిత కుటుంబాలను చూసినా జగన్ చలించలేదని ఆయన విమర్శించారు.అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యతను తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో కూడ జగన్ ఇదే రకంగా మొండి వైఖరిని ప్రదర్శించారన్నారు. కోర్టు మొట్టికాయలు వేయడంతో పరీక్షలపై వెనక్కి తగ్గారన్నారు. చివరికి చెత్త పన్ను కూడ వేశారన్నారు. జాబ్ కేలండర్ నిరసిస్తూ ఆందోళన నిర్వహించిన విద్యార్ధి యువజనులపై రేప్ కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు.చేతనైతే రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.
చట్టం లేకుండానే దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించారన్నారు.తాడేపల్లిలో యువతిపై అత్యాచారం కేసులో నిందితులన్ని పట్టుకోలేకపోయారన్నారు.వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంతవరకు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.