తుఫాన్ సమయంలో ప్రతిపక్ష నేత జగన్  విహార యాత్రలకు వెళ్లాడని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల గురించి జగన్  ఏనాడూ కూడ పట్టించుకోలేదన్నారు. 

హైదరాబాద్: తుఫాన్ సమయంలో ప్రతిపక్ష నేత జగన్ విహార యాత్రలకు వెళ్లాడని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల గురించి జగన్ ఏనాడూ కూడ పట్టించుకోలేదన్నారు.

శుక్రవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. అన్నీ కూడ ప్రభుత్వమే చూసుకొంటుందనే ధీమాతో జగన్ సినిమాకు వెళ్లాడేమోనని ఆయన ఎద్దేవా చేశారు.

జగన్ ఎప్పుడు రాష్ట్రంలో ఉన్నాడు... ఇప్పుడు రాష్ట్రంలో ఉండటానికి అని బాబు జగన్‌ తీరుపై మండిపడ్డారు. ఐదేళ్లుగా తాను.... మీరు (మీడియా) ఇక్కడే ఉన్నామని ఆయన చెప్పారు. కానీ, జగన్ మాత్రం హైద్రాబాద్‌లో ఉంటున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

సీఎస్‌ను అడుక్కోవాలా: ఎల్వీపై మళ్లీ మండిపడ్డ బాబు

ఉల్లంఘిస్తే చర్యలు: ఈసీపై మరోసారి బాబు గుర్రు

14 మండలాలపై ఫణి తుఫాన్ ప్రభావం: చంద్రబాబు