ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యంపై ఏపీ  సీఎం చంద్రబాబునాయుడు మరోసారి మండిపడ్డారు. సీఎస్ ను తమ సమావేశాలకు రావాలని అడుక్కోవాలా అని ఆయన ప్రశ్నించారు. 

అమరావతి: ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి మండిపడ్డారు. సీఎస్ ను తమ సమావేశాలకు రావాలని అడుక్కోవాలా అని ఆయన ప్రశ్నించారు.

శుక్రవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అన్ని రాష్ట్రాల్లో కూడ సీఎస్‌లు ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కానీ, ఏపీలో మాత్రం సీఎస్‌ మాత్రం తనకు రిపోర్ట్ చేయడం లేదన్నారు. ఎన్నికల సంఘం నియమించినందున ఎన్నికల సంఘానికే సీఎస్ రిపోర్ట్ చేస్తున్నారని ఆయన చెప్పారు.

కానీ, ఏపీలో మాత్రం సీఎస్‌ను సమావేశాలకు రావాలని అడుక్కోవాలా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎన్నికల సంఘం పరిధిలో ఉన్న అధికారులు ఎన్నికల కమిషన్‌కు రిపోర్ట్ చేస్తారన్నారు.

అయితే రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్‌కు బిజినెస్ రూల్స్ ప్రకారంగా అధికారులు నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీఎస్‌గా ఎల్వీ సుబ్రమణ్యం మూడు మాసాలు మాత్రమే ఉంటాడని ఆయన అభిప్రాయపడ్డారు.వచ్చే వారం కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. కోడ్ పేరుతో ఎవరూ ఈ సమావేశాన్ని అడ్డుకొంటారో చూస్తానని చంద్రబాబు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

ఉల్లంఘిస్తే చర్యలు: ఈసీపై మరోసారి బాబు గుర్రు

14 మండలాలపై ఫణి తుఫాన్ ప్రభావం: చంద్రబాబు