అమరావతి: దేశంలో బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కూటములే ఉంటాయని, మూడో ఫ్రంట్ అనేది ఎలా సాధ్యమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.  ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ ఏర్పాటు చేయతలపెట్టిన ఫ్రంట్‌పై బాబు విమర్శలు గుప్పించారు.

గురువారం నాడు అమరావతిలో  ఆయన మీడియాతో మాట్లాడారు.దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా లేదా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫ్రంట్‌‌లు ఉంటాయన్నారు. మరో ఫ్రంట్ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.  కేసీఆర్ ప్రాక్టీకల్‌గా మాట్లాడాలని ఆయన సూచించారు.

 మాయావతిలు కూడ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే వారంతా కాంగ్రెస్ ఫ్రంట్‌లో చేరాలని బాబు కోరారు.

కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా  ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్  బెంగాల్, ఒడిశా సీఎలతో భేటీ అయ్యారు. అఖిలేష్ యాదవ్‌ హైద్రాబాద్‌కు వచ్చి కేసీఆర్ ను కలుస్తానని చెప్పిన విషయం తెలిసిందే.