హైదరాబాద్: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు యూరప్ పర్యటన నుండి మంగళవారం నాడు ఉదయం హైద్రాబాద్‌కు తిరిగొచ్చారు.

ఈ నెల 19వ తేదీన చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులతో కలిసి యూరప్‌ పర్యటనకు  వెళ్లారు.  ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళ్లాలని భావించినా సాధ్యం కాలేదు. దీంతో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన యూరప్ టూర్‌కు వెళ్లారు.

చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలోనే  రాజ్యసభలో నలుగురు టీడీపీ ఎంపీలు టీడీపీపీని బీజేపీలో విలీనం చేశారు.కాకినాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలు సమావేశమయ్యారు. ప్రజా వేదికను కూల్చివేయాలని  ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

బుధవారం నాడు చంద్రబాబునాయుడు అమరావతికి వెళ్లనున్నారు. పార్టీ సీనియర్లతో ఆయనభేటీ కానున్నారు.