మోడీ వ్యాఖ్యలు బాధించాయి, కేసీఆర్‌‌‌ను ప్రశంసించడంపై బాబు ఇలా..

Chandrababunaidu responds on modi comments
Highlights

ఉద్దేశ్యపూర్వకంగానే తాము తెలంగాణ రాష్ట్రంతో వివాదాలు సృష్టిస్తున్నట్టుగా మోడీ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఖండించారు. కేసీఆర్ పరిణితి చెందిన నాయకుడని, తాను కాదని మోడీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబునాయుడు స్పందించారు


న్యూఢిల్లీ: ఉద్దేశ్యపూర్వకంగానే తాము తెలంగాణ రాష్ట్రంతో వివాదాలు సృష్టిస్తున్నట్టుగా మోడీ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఖండించారు. కేసీఆర్ పరిణితి చెందిన నాయకుడని, తాను కాదని మోడీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబునాయుడు స్పందించారు.శనివారం నాడు న్యూఢిల్లీలో చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తీవ్రంగా ఇబ్బందులు పడిన విషయాన్ని చెప్పారు.  కేసీఆర్‌తో తాము గొడవలు పడుతోంటే  మోడీ ఆ వివాదాలను పరిష్కరించినట్టు పార్లమెంట్‌‌లో ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు.

కేసీఆర్ పరిణితి చెందిన నాయకుడంటూ  తనకు పరిణితి లేదని మోడీ చెప్పడం సరైందికాదన్నారు. తాము  వివాదాలు సృష్టిస్తున్నట్టు చెప్పడంలో అర్థం లేదన్నారు.

పార్లమెంట్‌ వేదికగా మోడీ తనపై చేసిన వ్యాఖ్యలు తనకు బాధను కల్గించాయని చంద్రబాబునాయుడు చెప్పారు.  ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయాలని తాము కోరుతున్నామని ఆయన గుర్తు చేశారు. కానీ కేంద్రం నుండి సానుకూలంగా స్పందన లేదన్నారు.ఏపీ ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను అమలు చేయాల్సిన  అవసరాన్ని  కేంద్రాన్ని కోరినట్టు ఆయన ప్రస్తావించారు. 

loader