అమరావతి:  కియా  కార్ల ఫ్యాక్టరీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చారని ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పడం  దారుణమని  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

మంగళవారం నాడు చంద్రబాబునాయుడు  పలువురు టీడీపీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల పనుల్లో పురోగతి లేదన్నారు. పీపీఏలపై  బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతిని అప్రతిష్టపాల్జేసేందుకు ప్రయత్నిస్తున్నారని  ఆయన ఆరోపించారు. 

సున్నా వడ్డీ రుణాలు టీడీపీ ఇవ్వలేదని జగన్ చెప్పారని.. ఆధారాలతో సహా బయటపెట్టేసరికి ప్లేట్ ఫిరాయించారని చంద్రబాబు విమర్శించారు.