అమరావతి: హెరిటేజ్ నాదని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఏపీ అసెంబ్లీలో విపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు. మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీలో ఉల్లి ధరల విషయంలో  చర్చ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు, విపక్ష నేత చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు.

హెరిటేజ్ సంస్థ తనకు సంబంధం లేదని తాను నిన్ననే అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. ఇవాళ  కూడ  ఇదే విషయమై చంద్రబాబునాయుడు జగన్‌కు సవాల్ విసిరారు. 

Also read:నీ జాగీరు కాదు, గుడివాడలో నేనున్నా జాగ్రత్త: చంద్రబాబుకు కొడాలి నాని వార్నింగ్

 హెరిటేజ్ సంస్థ నాది అంటూ రుజువు చేయాలని ఆయన సవాల్ విసిరారు. హెరిటేజ్ సంస్థను అమ్మేసినట్టుగా ఆయన గుర్తు చేశారు ఈ సవాల్‌ను స్వీకరించాలని జగన్‌ను చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.

హెరిటేజ్ సంస్థ తనది కాదని నిరూపించలేకపోతే జగన్ సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.  సండూర్ కంపెనీ మాదిరిగా తాను చేయలేదని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.

also read:ఆ పాపంలో నాకు భాగం ఉంది, 15 ఏళ్లు ప్రతిపక్షానికే: స్పీకర్ తమ్మినేని సంచలనం

ఈ విషయమై మంత్రి కొడాలి నాని జోక్యం చేసుకొన్నారు. గుడివాడలో ఉల్లిగడ్డల కోసం సాంబయ్య  రైతు బజారు వద్ద క్యూ లైనులో ఉండి చనిపోయినట్టుగా టీడీపీ సభ్యులు తప్పుడు ప్రచారం చేశారని మంత్రి గుర్తు చేశారు. తప్పుడు ప్రచారం చేసినందుకు చంద్రబాబు రాజీనామా చేస్తారా అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.

ఇదే విషయమై ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు.బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో వచ్చిన వార్తను చదివి విన్పించారు. హెరిటేజ్ ఫ్రెష్‌లో చంద్రబాబు కుటుంబానికి షేర్స్ ఉన్నాయని చెప్పారు.