Asianet News TeluguAsianet News Telugu

ముందస్తు ఎఫెక్ట్: బీజేపీ వ్యతిరేక శక్తులతో కలుస్తామంటున్న చంద్రబాబు

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేయ్యాలన్న ఆలోచనలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ముందస్తు ఎన్నికలపై అమరావతిలో మంత్రులు పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. తెలంగాణలో బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే అంశంపై చర్చించారు.

Chandrababu will decided alliance with congress
Author
Amaravathi, First Published Sep 7, 2018, 7:37 PM IST

అమరావతి: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేయ్యాలన్న ఆలోచనలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ముందస్తు ఎన్నికలపై అమరావతిలో మంత్రులు పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. తెలంగాణలో బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే అంశంపై చర్చించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే టీడీపీతో పొత్తుకు స్నేహ హస్తం అందించింద. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఏపీపై ఎలాంటి ప్రభావం చూపుతుందని నేతలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యాయని ఆ పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడితే అందులో టీడీపీ కూడా భాగస్వామ్యం అయితే బాగుంటుందని పార్టీ నేతలు సూచించారు. మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీతోపాటు వామపక్ష పార్టీలు, తెలంగాణ జనసమితి పార్టీలు ఉంటాయని ఆనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు అనే అంశం తెరపైకి వచ్చే అవకాశం లేదని ఏపీలో ఆ ప్రభావమే కనిపించదని సూచించారు.  

మరోవైపు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటూ చేసిన హంగామా అంతా బీజేపీ కోసమేనని ఆరోపించారు. బీజేపీ టీఆర్ఎస్ ల మధ్య అవగాహన ఉందని చంద్రబాబు నాయుడుకు పలువురు నేతలు సూచించారు. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి పని చెయ్యాలని చంద్రబాబుకు సూచించారు. 

ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతుంది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సైతం పొత్తుకు మెుగ్గు చూపుతున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన స్నేహ హస్తాన్ని అందించడంతోపాటు టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణతో సైతం చర్చించారు. ఈ నేపథ్యంలో టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశారు. శనివారం పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో పొత్తులపై చర్చిద్దామంటూ సూచించారు. 

శనివారం మధ్యాహ్నం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ టీడీపీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. అలాగే పార్టీ జనరల్ బాడీ మీటింగ్ కూడా నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏ పార్టీతో పొత్తులు ఉండాలి...ఎక్కడ పోటీ చెయ్యాలి అనే అంశాలపై చర్చించనున్నారు. అలాటే టీడీపీ మేనిఫెస్టోపై కూడా చర్చించనున్నారు. 

మెుత్తానికి శనివారం తెలుగుదేశం పార్టీ జనరల్ బాడీ మీటింగ్ తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అన్ని పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడితే మహాకూటమిలో భాగస్వామ్యం కావడమా లేక కాంగ్రెస్ పార్టీతో నేరుగా పొత్తు పెట్టుకోవడమా అన్నదానిపై చంద్రబాబు నాయుడు తేల్చే అవకాశం ఉంది. అలాగే టీడీపీ గెలిచే నియోజకవర్గాలు అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios