బీసీ నేతలను వేధిస్తున్నారు: ఎమ్మెల్యే భవానీ కుటుంబ సభ్యులకు బాబు పరామర్శ

చిట్ ఫండ్ కేసులో  అరెస్టైన టీడీపీ  నేతలు  ఆదిరెడ్డి,ఆయన తనయుడు వాసులను  రాజమండ్రి జైలులో  చంద్రబాబు ఇవాళ పరామర్శించారు. 

Chandrababu  Visits Rajahmundry Mla Bhavani Residence  lns

రాజమండ్రి: బీసీ నాయకుల్ని అక్రమ కేసులతో  జగన్  వేధిస్తున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు.  శుక్రవారంనాడు రాజమండ్రి సెంట్రల్ జైులో  మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి , ఆయన తనయుడు వాసులను  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పరామర్శించారు. అనంతరం  ఆయన  రాజమండ్రి ఎమ్మెల్యే భవానీ ఇంటికి వెళ్లి  కుటుంబ సభ్యులతో మాట్లాడారు.   

కష్టపడి రాజకీయాల్లో ఎదిగిన బీసీ నేత ఎర్రన్నాయుడి కుమార్తెను అక్రమ కేసులతో జగన్  వేధిస్తున్నారన్నారు. మేయర్ గా, ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రజలకు విశేష సేవలందించారని చంద్రబాబు చెప్పారు. ఆదిరెడ్డి కుటుంబం నీతి నిజాయితీగా ఎన్నో ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తోందన్నారు.డిపాజిట్లు దారులెవరూ ఫిర్యాదు చేయకుండా  జగజ్జనని చిట్ ఫండ్ పై అక్రమ కేసులు నమోదు చేశారని చంద్రబాబు విమర్శించారు.ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు పార్టీ మారాలని భవానిపై ఒత్తిడి తెచ్చారని  చంద్రబాబు చెప్పారు.    పార్టీ మారకపోవటంతో అక్రమ కేసులతో వేధిస్తున్నారన్నారు.8 వతరగతి పిల్లాడిని పోలీసులు బెదిరించటం సైకో పాలనకు పరాకాష్టగా  చంద్రబాబు చెప్పారు.తమ పార్టీ   22 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ  ఏనాడు ఇలా వ్యవహరించలేదన్నారు.ఆదిరెడ్డి కుటుంబం చేసిన తప్పేంటి? జగన్ మాదిరి సొంతబాబాయిని చంపారా? అని  చంద్రబాబు ప్రశ్నించారు.

జగన్ పాలనలో బీసీలు చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేయటానికి వీళ్లేదా?  అని ఆయన అడిగారు. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా భవానిపై  సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టి మానసికంగా వేధించారన్నారు.అప్పారావు, వాసును పరామర్శించడానికి తనకు  అనుమతిచ్చిన రాజమండ్రి జైలు అధికారి రాజారావును ట్రాన్స్ ఫర్ చేస్తారా అని చంద్రబాబు  మండిపడ్డారు.

తమ  పార్టీ నేతల్ని  పరామర్శించకూడదా? జగన్ 16 నెలలు జైల్లో ఉంటే అతన్ని కలవడానికి  ఎవరూ వెళ్లలేదా? అన వైసీపీని అడిగారు.తప్పుడు పనులు చేసే వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చంద్రబాబు వార్నింగ్  ఇచ్చారు.   ఎమ్మెల్సీ ఎన్నికల పలితాలు జగన్ పాలనపై తిరుగుబాటుకు సూచికగా  చంద్రబాబు పేర్కొన్నారు.  ఆదిరెడ్డి కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios