చంద్రబాబు అమరావతి పర్యటన... ఓవైపు స్వాగతం..మరోవైపు నిరసనలు
అనంతరం బలహీన వర్గాల వారి కోసం నిర్మించిన గృహ సముదాయాన్ని చంద్రబాబు సందర్శిస్తారు. ఆ తర్వాత అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న భవనాలను, జడ్జీల బంగ్లాలను పరిశీలిస్తారు. ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అమరావతిని కాపాడేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు రాజధాని అమరాతిలో పర్యటిస్తున్నారు. కాగా... ఆయనకు ఓవైపు టీడీపీ నేతలు స్వాగతం పలుకుతుంటే.. మరోవైపు వైసీపీ నేతలు , కార్యకర్తలు నిరసనలు చేపడుతున్నారు.
ఉదయం 9గంటలకు తన నివాసం నుంచి చంద్రబాబు , టీడీపీ నేతలతో కలిసి అమరావతి సందర్శనకు బయలుదేరారు. ముందుగా ఉద్దండరాయుని పాలెంలో ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు పరిశీలిస్తున్నారు.
ఆయన తన పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంత రైతులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇటీవల కూల్చివేసిన ప్రజావేదిక ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. అనంతరం బలహీన వర్గాల వారి కోసం నిర్మించిన గృహ సముదాయాన్ని చంద్రబాబు సందర్శిస్తారు. ఆ తర్వాత అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న భవనాలను, జడ్జీల బంగ్లాలను పరిశీలిస్తారు. ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అమరావతిని కాపాడేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేశారు.
అంతకుందు మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా... చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.